ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది- టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి

నమస్తే శేరిలింగంపల్లి: పవిత్ర రంజాన్ మాసాన్ని ముస్లిం మైనార్టీ సోదరులు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి ఆకాంక్షించారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జెరిపాటి జైపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దవాత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమానికి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, రంగారెడ్డి జిల్లా యవజన కాంగ్రెస్ అధ్యక్షుడు రవికాంత్ గౌడ్, మెదక్ పార్లమెంట్ ఇంచార్జీ గాలి అనిల్ కుమార్, పఠాన్ చెరు ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముస్లిం మేనార్టీ సోదరులతో కలిసి ఉపవాస దీక్షలను విరమింపజేశారు. రంజాన్ పవిత్ర మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైన మాసమని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ స్పోకెస్ పర్సన్ నిజాముద్దీన్, కౌషల్ సమీర్, మైనారిటీ జిల్లా అధ్యక్షులు రషీద్ ఖాన్, రియాజ్ ఖాన్, హాబీబ్, ఆయాజ్ ఖాన్, శేరిలింగంపల్లి ముఖ్య నాయకులు రఘునందన్ రెడ్డి, మైపాల్ యాదవ్, ఇలాయస్ షరీఫ్, మారేళ్ల శ్రీనివాస్, నాగేష్ నాయక్, రేణుక, జావీద్ హుస్సేన్, సురేష్ నాయక్, జహంగీర్, అజీముద్దీన్, కాట నరసింహా గౌడ్, అల్లావుద్దీన్ పటేల్, పోచయ్య, రాజేందర్, మాక్బుల్, ఖాజా షేక్, చాంద్ భాయ్, హరికిషన్, శామ్యూల్ కార్తిక్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సౌందర్య రాజన్, ముషారఫ్, సలీం, దుర్గేశ్, శ్రీహరి గౌడ్, ఖాజా, మెహ్రాజ్, అసద్, రాఫీక్, రాజేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here