నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా ముస్లిం మైనార్టీల కోసం రంజాన్ తోఫాలను అందజేయడం ఆనవాయితీగా వస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట, ఇంద్రా నగర్ కాలనీ లలో గల మసీదుల వద్ద రంజాన్ మాస పర్వదినం సందర్భంగా ముస్లింలకు స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే గాంధీ రంజాన్ బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం చాలా పవిత్రమైనదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి సంవత్సరం పేద ముస్లింలకు బట్టలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పేద ముస్లింల పిల్లల కోసం షాదుబారక్ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, నాయకులు రవీందర్ రెడ్డి, అక్బర్ ఖాన్ , అంజద్ పాషా, యూసఫ్ పాషా, జుబేర్ బేగ్, కొండల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అల్తాఫ్, సికెందర్, ఖదీర్, ఇమ్రాన్, అఫ్సర్ తదితరులు పాల్గొన్నారు.