శేరిలింగంపల్లి, మార్చి 29 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీరామకృష్ణపరమహంస జయంతి సందర్బంగా వారోత్సవాలను మార్చి 21 నుంచి 28వ తేదీ వరకు మియాపూర్‌లోని శ్రీరామకృష్ణవివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మియాపూర్ జడ్పీహెచ్ఎస్, మక్తా మహబూబ్ పేట జడ్‌పీహెచ్ఎస్ విద్యార్థులు క్విజ్ పోటీలు, ఉత్తిష్ఠ భారత బృందగానం పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు, బహుమతుల కిట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ జడ్‌పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు వసుంధర, ఉపాధ్యాయులు మదన్ మోహన్, విజయ, సమితి ప్రతినిధి డి.దత్తాత్రేయ, ZPHS మక్తా మహబూబ్ పేట ప్రధానోపాధ్యాయుడు నరేందర్ రాజు, సహాధ్యాపకులు, JNTUH వరిష్ట ప్రాచార్యులు, సమితి కార్యదర్శి Dr.K.చంద్రశేఖరయ్య పాల్గొన్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు వేసవి శిక్షణాశిబిరం, ప్రతి ఆదివారం నిర్వహించే స్పోకెన్ ఇంగ్లీష్, ప్రత్యేక శిక్షణాతరగతుల వంటి సమితి కార్యక్రమాల వివరాలకు 9849352231 అనే ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.