శేరిలింగంపల్లి, ఏప్రిల్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్చి 30 నుండి జూన్ 2 వరకు వేసవి సెలవులు ప్రకటించినప్పటికీ శ్రీ చైతన్య కాలేజ్ వారు యధావిధిగా విద్యార్థులకు సెలవులు ఇవ్వకుండా ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను సమ్మర్ క్లాస్సెస్ పేరుతో రెండవ సంవత్సరం ఫీజు కూడా ఇప్పుడే తీసుకొని క్లాసెస్ నిర్వహిస్తున్నారని, వీరు చేసిన చర్యను వ్యతిరేకిస్తూ విద్యార్థుల పక్షాన సెలవులు ప్రకటించాలని AIFDS చేస్తున్న ఆందోళనకు దిగివచ్చిన శ్రీ చైతన్య యాజమాన్యం హైదర్ నగర్, మియాపూర్ మహిళా కళాశాల, మీరా భవన్, అమీన్‌పూర్ ఏకే భవన్ కేకే భవన్ లో విద్యార్థులకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించిందని, వారి తల్లిదండ్రులకు వచ్చి తీసుకెళ్లాల్సిందిగా మెసేజ్‌లను పంపించారని AIFDS గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ యం శ్రీకాంత్ అన్నారు. AIFDS పోరాటం వల్లే ఇది సాధ్యమైందని, ఇకనైనా విద్యార్థులను ఇబ్బంది పెట్టే చర్యలు మానుకోవాలని లేనియెడల బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉత్తర్వులను బుట్టదాఖలు చేస్తే యాజమాన్యం గుర్తింపు రద్దు అయ్యేంతవరకు పోరాడుతామని హెచ్చరించారు.