నమస్తే శేరిలింగంపల్లి:శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న తొమ్మిది మంది బాధితులకు ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 4.29 లక్షలకు సంబంధించి చెక్కులను కార్పొరేటర్లు రోజా దేవి రంగరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా వచ్చిన డబ్బులు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్న పేదలకు ఆసరాగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి , మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు పోతుల రాజేందర్, శ్రీనివాస్ చౌదరి, ఎల్లంనాయుడు, తిరుపతి, రజినీకాంత్ తదితరులు పాల్గొనారు.