సీఎం రిలీఫ్ ఫండ్ స‌హాయం అంద‌జేత

మాదాపూర్‌, సెప్టెంబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కాలనీకి చెందిన మహమ్మద్ హుస్సేన్ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా CMRF-LOC ద్వారా మంజూరైన రూ.1.50 ల‌క్ష‌లు, అలాగే వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని సుమిత్ర నగర్ కాలనీకి చెందిన లక్ష్మీకి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ.1.25 ల‌క్ష‌ల‌కు చెందిన CMRF- LOC మంజూరు పత్రాలను బాధిత కుటుంబాలకి PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అంద‌జేశారు.

బాధితుల‌కు సీఎం రిలీఫ్ ఫండ్ ప‌త్రాల‌ను అంద‌జేస్తున్న ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఆప‌ద‌లో ఉన్న‌వారికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, ప్ర‌జ‌లు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, శోభన్, అల్లం మహేష్, మల్లయ్య, విమల, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here