కేసీఆర్ మూవీ టీమ్ కు రవీందర్ యాదవ్ అభినందనలు

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ నేటివిటీ ఉట్టిపడేలా కేసీఆర్ సినిమాను తెరపైకి తీసుకు వచ్చిన జబర్ధస్త్ కమెడియన్ రాకేష్ ను భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ ప్రత్యేకంగా సన్మానించారు. సినిమా చూస్తున్నంత సేపు రాకేష్ అతని టీమ్ పడిన కష్టం మనకు కనిపిస్తుందన్నారు. కేసీఆర్ పాలనను సినిమాలో చూపించిన తీరు అద్భుతమని కొనియాడారు. మన ఇంట్లో అబ్బాయి లేదా మన ఊరిలో ఉండే ఓ యువ‌కుడి కథలా అనిపిస్తుందని చెప్పారు. థియేటర్స్ లో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రాకేష్ సినిమాలో చూపించిన కేసీఆర్ పాలనను గుర్తు చేసుకున్నారన్నారు. అలాగే చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన‌ రాకేష్.. రీసెంట్ గా కేసీఆర్ ( కేశవ‌ చంద్ర ర‌మావత్) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చిన్న చిన్న స్టేజ్ షోల దగ్గర నుంచి ఇప్పుడు ఓ సినిమాకు నిర్మాతగా నటుడిగా మారి ఎంతో మందికి స్పూర్తి‌గా నిలిచాడని రవీందర్ యాదవ్ కొనియాడారు. తెలంగాణలో మళ్లీ భారాస అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. రేవంత్ పాలనను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని వెల్లడించారు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా పేదల జీవితాలను బుగ్గిపాలు చేసే నిర్ణయాలతో రోడ్డుమీద పడేసేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ సీఎం అవుతారని రవీందర్ యాదవ్ అన్నారు.

జ‌బ‌ర్ద‌స్త్ రాకేష్‌ను అభినందిస్తున్న ర‌వీంద‌ర్ యాద‌వ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here