శేరిలింగంపల్లి, డిసెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కూకట్‌పల్లి డివిజన్‌కు చెందిన మధు గౌడ్ చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.50వేల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును బాధిత కుటుంబానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, గొట్టిముక్కుల వెంకటేశ్వర రావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు బాష్పాక యాదగిరి, మల్లేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.