2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను వసూళ్లలో చందానగర్ సర్కిల్ 4వ స్థానం

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో 2024-25 ఆస్థి పన్ను వసూలు రికార్డు స్థాయిలో వసూలైన సందర్బంగా జిహెచ్ఎంసి రెవెన్యూ విభాగానికి (30 సర్కిళ్లకు) సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా చందానగర్ సర్కిల్-21 నాలుగవ స్థానం (4th place) వచ్చినందున చందానగర్ సర్కిల్ రెవెన్యూ విభాగనికి సన్మానం నిర్వ‌హించారు. ఈ సందర్బంగా ఉప కమీషనర్ పి. మోహన్ రెడ్డి మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 109.54 కోట్ల ఆస్తి పన్ను వసూలైనట్లు తెలిపారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, టాక్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు మొత్తం బృందం సమిష్టి కృషి వల్ల ఈ ఘనత సాధించగలిగామని తెలిపారు. చందానగర్ రెవిన్యూ విభాగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్కిల్ రెవెన్యూ విభాగం ఏఎంసీలు, టాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు. ఎర్లీ బర్డ్ స్కీం ద్వారా ఆస్తి పన్ను ఏప్రిల్ 30వ తేదీ లోగా చెల్లిస్తే 5 శాతం రాయితీ పొందే అవకాశం ఉందని, ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎర్లీ బర్డ్ స్క్రీం అందుబాటులో ఉందని, కేవలం 2025-26 ఆర్థిక సంవత్సర ఆస్తి పన్నుకు మాత్రమే ఎర్లీ బర్డ్ స్కీం వర్తింస్తుందని, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలపై ఎర్లీ బర్డ్ స్కీం వర్తించదని ఉప కమీషనర్ తెలిపారు. శనివారం, ఆదివారం, సోమవారం ఏప్రిల్ నెలలోని అన్ని సెలవు రోజులలో బిల్ కలెక్టర్ అందుబాటులో ఉంటారని, సర్కిల్ ఆఫీస్ సిటిజన్ సర్వీస్ సెంటర్ కూడా అందుబాటులో ఉంటుందని, ఫోన్ పే, గూగుల్ పే, క్రెడిట్ కార్డ్, మీ సేవా సెంటర్లలో ఆస్థి పన్ను చెలించుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చందానగర్ సర్కిల్ ప్రజలకు ఉప కమిషనర్ మోహన్ రెడ్డి సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here