సెంట్రల్ పార్కు ఫేజ్ -1లో పర్యటించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సెంట్రల్ పార్కు ఫేజ్-1లో మంగళవారం స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతర్గత సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థతో పాటు పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ సెంట్రల్ పార్క్ కాలనీ ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ సునీల్, వర్క్ ఇన్‌స్పెక్టర్ యాదగిరి, సెంట్రల్ పార్కు కాలనీ ప్రెసిడెంట్ రామకృష్ణ, ఆంజనేయ శర్మ, లక్ష్మణ్ యాదవ్, పటోళ్ల నర్సింహ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

సెంట్రల్ ఫార్కు ఫేజ్ -1లో పర్యటించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here