నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ కు బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రకు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ రావడం సంతోషకరమని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లి కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ కు స్వాగతం పలికారు.