నమస్తే శేరిలింగంపల్లి:చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో జీహెచ్ఎంసీ, వైద్య శాఖ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ ను చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పెషల్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు ఓ.వేంకటేష్, రమేష్, నరేందర్, కాలనీ వాసులు, జీహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.