నమస్తే శేరిలింగంపల్లి: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంతో పాటు ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ సబ్సిడీ రూ. 200 తగ్గించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెట్రోల్ పై రూ. 8, డీజిల్ పై రూ. 6 తగ్గించడం సంతోషకరమని అన్నారు. అంతర్జాతీయంగా క్రుడ్ ఆయిల్ ధరలకు అనుగణంగా పెట్రోల్, డీజిల్. ధరలు ఉంటాయని, సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని మోదీ కరోనా పరిస్థితుల్లో కూడా టాక్స్ తగ్గించడం గొప్ప విషయమన్నారు. ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు సంవత్సరానికి 12 సిలిండర్లు తీసుకున్న వారికి రూ. 200 చొప్పున తగ్గింపు చేశారని అన్నారు ఈ నిర్ణయంతో దాదాపు 9 కోట్ల పేద, మధ్యతరగతి వారికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా పెట్రోలు, డీజిల్ పై రాష్ట్ర టాక్స్ తగ్గించాలని బుచ్చిరెడ్డి డిమాండ్ చేశారు.