శేరిలింగంపల్లి, జనవరి 30 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మహాత్మా గాంధీ విగ్రహానికి స్థానిక బిఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు పూర్తి చేయనందుకు నిరసనగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రంను సమర్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ miyapur division president బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, రోజా కలిదిండి, గోపరాజు శ్రీనివాసరావు, శ్రీధర్, చిన్న, రమేష్, సంతోష్, నరసింగరావు, జహంగీర్, సురేష్ గౌడ్, నర్సింగ్, రాజు, ముజీబ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.