శేరిలింగంపల్లి, జనవరి 30 (నమస్తే శేరిలింగంపల్లి): అహింస, శాంతియుత పోరాటం ద్వారా మన హక్కులను పొందగలం అనే మార్గం చూపిన మహనీయుడు బాపూజీ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్దంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని మాక్తా మహబూబ్ పేట్ లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి మియాపూర్ డివిజన్ నాయకులతో కలిసి ఆయన పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు, నాగుల్ గౌడ్, లక్ష్మణ్ ముదిరాజ్, గణేష్ ముదిరాజ్, రాజేష్ గౌడ్, శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి,శివరాం, వినోద్ యాదవ్, సురేష్ ముదిరాజ్, మాన్యం, రాము, శివారెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నారు.