గుట్టల బేగంపేట బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి – బిజెపి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని గుట్టల బేగంపేట్ వడ్డెర బస్తీ లో కలుషిత నీరు తాగి మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 25లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం‌ అందించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయాల‌ని బిజెపి‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి డిమాండ్ చేశారు. గుట్టల బేగంపేట లో అధికారుల నిర్లక్ష్యం తో కలుషిత నీటిని తాగి ఇద్దరు మృతి చెందడం, 136 మంది అస్వస్థతకు గురైన ఘటనను నిరసిస్తూ హఫీజ్ పేట్ జల మండలి కార్యాలయం వద్ద బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ గౌడ్ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి పాల్గొని మాట్లాడారు. మూడు నెలలుగా కాలనీలో‌ కలుషిత నీరు సరఫరా అవుతుందని అధికారులకు స్థానికులు చెప్పినా స్పందించకపోవడం దారుణమన్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే కలుషిత నీటిని తాగి బస్తీ వాసులు అస్వస్థతకు గురయ్యారని, ఇద్దరు మృతి చెందారని అన్నారు. ఇందుకు కారకులైన సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే బస్తీలోని డ్రైనేజీ, మంచి నీటి పైపు లైన్లను సరిచేయాలన్నారు. నియోజకవర్గంలోని బస్తీల్లో ఇలాంటి సమస్యలు రాకుండా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా డ్రైనేజీ, నీటి సమస్యలను మెరుగుపరచాలి అని సూచించారు. ఈ డిమాండ్లను 48 గంటల్లో తీర్చకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, రాష్ట్ర నాయకులు యోగానంద్, మొవ్వ సత్యనారాయణ, రవి కుమార్ యాదవ్, నరేష్, నాయకులు గంగాధర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, డి ఎస్ ఆర్ కె ప్రసాద్,ప్రభాకర్ యాదవ్, మారం వెంకట్, హరికృష్ణ, రాధాకృష్ణ యాదవ్, విజయ లక్ష్మి, నాగేశ్వర్ గౌడ్, శ్రీశైలం కురుమ, రఘునాథ్ యాదవ్, హనుమాన్ నాయక్, జితేందర్, కాంచన కృష్ణ, విజేందర్, వీర చారి, డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ రావు, మాణిక్ రావు, రాజు శెట్టి, ఆంజనేయులు, నవీన్ గౌడ్, కమలాకర్, నర్సింగ్, భూపాల్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

హఫీజ్ పేట్ జలమండలి కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here