భారతీనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీనగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా తోపుగొండ రజని మహిపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆమె రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. డివిజన్‌లో బీజేపీ తరపున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రజలు ఓటు వేసి గెలిపిస్తారనే నమ్మకం ఉందని అన్నారు.
