నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో బీహార్ క్రాఫ్ట్ ఫెయిర్ కి సందర్శకుల నుండి మంచి స్పందన వస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కళాకారులు ప్రదర్శించిన నృత్యప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. బీహార్ క్రాప్ట్ ఫెయిర్ లో ఖాదీ వస్త్రాలు, చీరలు, మిథిలా పెయింటింగ్స్, కుర్తాలు, రాఖీలు , ఫైల్స్, బ్యాగ్స్, డెకొరేటివ్ వాల్ హ్యాంగింగ్స్, బుట్టలు, తదితర హస్త కళా ఉత్పత్తుల స్టాల్స్ ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. పేరిణి శ్రీనివాస్ శిష్య బృందం సభ్యులతో ఆంధ్ర నాట్య ప్రదర్శన అలరించింది. ప్రదర్శన లో భాగంగా నిన్ను మించిన, సంధ్య తాండవం, భామాకలాపం, శబ్ద పల్లవి, తిల్లాన అంశాలను శ్రీ హర్షిని, ప్రపూర్ణ, శ్రీ వళ్లిక, నికిత, తన్మయి, వర్షిత తదితరులు ప్రదర్శించగా బీహార్ రాష్ట్రానికి చెందిన జానపద పాటలు, నృత్యాలను బీహార్ కళాకారులు ప్రదర్శించి మెప్పించారు.