బండి సంజయ్ కు రవికుమార్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కు బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన స్వగ్రామమైన కరీంనగర్ లో నిర్వహించిన జన్మదిన వేడుకలలో రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. బండి సంజయ్ కు పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ బండి సంజయ్ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో దినదినాభివృద్ధి చెందుతోందని, ఆగస్టులో తల పెట్టనున్న మూడో సంగ్రామ యాత్ర విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. బండి సంజయ్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

బండి సంజయ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రవికుమార్ యాదవ్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here