నమస్తే శేరిలింగంపల్లి: విధి నిర్వహణలో నిమగ్నమై పరిసరాల పరిశుభ్రతకు పాటు పడుతున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరవలేనివని బీజీజీ యువసైన్యం సభ్యులు పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ పుట్టినరోజును పురస్కరించుకుని శనివారం పారిశుద్ధ్య కార్మికులకు బీజీజీ యువసైన్యం సభ్యులు చీరలను పంపిణీ చేశారు. ప్రతి నిత్యం వేకువజామునే తమ విధి నిర్వహణలో నిమగ్నమై పరిసరాల పరిశుభ్రతకు పాటు పడుతూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కాపాడేందుకు పారిశుద్య కార్మికుల కృషి ఎనలేనిదని అన్నారు. బాలింగ్ గౌతమ్ గౌడ్ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం యువసైన్యం సభ్యులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తలారి రాకేష్, విక్రమ్, రాజేష్, మహేష్, విశాల్, ప్రిన్స్, రవి, రమేష్ గౌడ్, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.