శేరిలింగంపల్లి, ఏప్రిల్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమయ్యపురంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు ఆధ్వర్యంలో అనూష ఆర్ట్స్ అకాడమీ గురువు అనూష సూర్యాస్ శిష్య బృందం నృత్యగానం చేశారు. 19 మంది శ్రావ్యంగా, కన్నుల విందుగా ప్రదర్శించారు. రిత్విక రంగ, పర్నిత వర్షిని, అక్షయ పర్నిక, పి. ఋగ్వేద్ రంగ, రిషిక రంగ, నాంపల్లి ఇషా శ్రీ, అదితి అల్లూరి, శ్రీకర్ వారణాసి, వికాసిని గొల్లపోతు, అవినాష్ మాధవ్, బద్రి నారాయణ కార్తిక్ పల్లపోలు, ప్రణయ దేవి గద్దె, త్రిషిక కత్తెరసాల, ఆన్య కాకుమాని, దివి నందిమండలం, దుర్గ బ్రహ్మాండం, కే. కృష్ణ సమన్వి, కే. శాంభవి ప్రియ, అధిర కర్క సంయుక్తంగా శ్రీ మహా గణేశ పంచరత్నం, నారాయణతే నమో నమో, గరుడ గమన, నారాయణ మంత్రం, గోవిందా గోవింద యని కొలువరే, శరణు శరణు, రామచంద్రాయ జానక, అచ్యుతం కేశవం అనే సంకీర్తనలను భక్తి శ్రద్ధలతో కూచిపూడి నృత్య ప్రదర్శన ద్వారా ఆడి పాడారు.
వీరికి తబలా మీద ప్రకాష్, వయోలిన్ పై హరినాథ్ వాయిద్య సహకారం అందించారు. అనంతరం కళాకారులకు, అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ డా శోభా రాజు, మేనేజింగ్ ట్రస్టీ డా. నంద కుమార్ ఙ్ఞాపికలను అందించారు. చివరిగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతి ఇచ్చి వారి తీర్థ ప్రసాదాలతో అన్నమ స్వరార్చనను ముగించారు.