శేరిలింగంపల్లి, ఏప్రిల్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): ఆదివారం వరంగల్‌లోని ఎల్కతుర్తి క్రాస్ రోడ్ వద్ద నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని పార్టీ నాయకులు కోరారు. ఈ సభకు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి భారీ ఎత్తున తరలి వెళ్లనున్నట్లు వారు తెలిపారు. వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, సీనియర్ నాయకులు మారబోయిన రవి యాదవ్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఎర్రవెల్లి సతీష్ రావు, మల్లారెడ్డి, రామకృష్ణ, పి శ్రీకాంత్ ముదిరాజ్, బిఎస్ఎన్ఎల్ కిరణ్ యాదవ్, గోపు శ్రీనివాస్, రోజా, అల్లావుద్దీన్ పటేల్, శ్రీకాంత్ యాదవ్, నక్క శ్రీనివాస్, కలీం, సంజీవరెడ్డి, సుబ్బరాజులు ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నియోజకవర్గం నుండి సుమారుగా 5000 మంది కోసం 100 బస్సులు 200 వాహనాలలో వెళ్లడానికి భారీగా ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు హాజరు కావాలని, పార్టీ 25వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు రావలసిందిగా కోరారు.