శేరిలింగంపల్లి, మార్చి 11 (నమస్తే శేరిలింగంపల్లి): అంగన్ వాడీ స్కూల్‌లో నెలకొన్న సమస్యలను తన సొంత నిధులతో పరిష్కరిస్తానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ అన్నారు. హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని సాయినగర్‌లో ఉన్న అంగన్ వాడీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్ వాడీ కేంద్రానికి అవసరం అయిన సహాయం చేస్తామని అన్నారు. తన సొంత నిధులతో కేంద్రంలోని సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న సమస్యలను టీచర్ జ్యోతిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంజు సాగర్, రెడ్డి, కామాజీ వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బాబు గౌడ్, రంజిత్, మహేష్, రాధాకృష్ణ పాల్గొన్నారు.