శేరిలింగంపల్లి, జూన్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న ప్లాట్ నెంబర్ 258 లో కొనసాగుతన్న HELLO KIDS స్కూల్ లో యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా అదనపు అంతస్తు నిర్మిస్తుందని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, ఏసీపీ వెంకటరమణ, టిపిఎ జీష్యం, చైన్ మెన్ మల్లేష్ కి బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ హలో కిడ్స్ యాజమాన్యం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని అన్నారు. 2 నెలలు వేసవి సెలవులు ఉన్నప్పుడు అదనపు అంతస్తు నిర్మించుకోకుండా ఇప్పుడు మరో 2 రోజుల్లో పాఠశాలలు ప్రారంభం అవుతాయనగా చెక్కలు బిగించి మరో అంతస్తు నిర్మిస్తున్నారని అన్నారు. ఇది విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేయడమేనని అన్నారు. వెంటనే స్కూల్ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.