శేరిలింగంపల్లి, అక్టోబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ MA నగర్ లో తాండ్ర కుమార్ విగ్రహం వద్ద ఏఐఎఫ్డీడబ్ల్యూ గ్రేటర్ కమిటీ ఆధ్వర్యంలో మద్దికాయల ఓంకార్ కి నివాళి అర్పించారు. పక్షోత్సములో చివరి రోజైన బుధవారం నివాళులు అర్పించారు. గ్రేటర్ కమిటీ అధ్యక్షురాలు V. అవిత అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షురాలు A. పుష్ప మాట్లాడుతూ దేశాన్ని పాలించిన దోపిడీ వర్గ మతోన్మాద, అవినీతి, అవకాశ వాద పార్టీలు రాజకీయాలను దిగజార్చాయి అని ఆరోపించారు. ప్రజల ఓట్లతో గెలిచి చట్ట సభలను శాసించిన పార్టీలు అనుకూలమైన చట్టాలు చేయకుండా, దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పరచకుండా దిగజార్చాయని అన్నారు. ఈ సమావేశంలో గ్రేటర్ సభ్యురాలు G. శివాని, ఎం.డి అమీనా బేగం, S.గీత, M.D. సుల్తానాబేగం, M.D. రజియా, B. యాదమ్మ, K. నిర్మల, రాధిక తదితరులు పాల్గొన్నారు.