బిజెపి గెలుపు పట్ల విద్యాకల్పన విజయోత్సవాలు

నమస్తే శేరిలింగంపల్లి: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బిజెపి విజయ దుందుబి మోగించడం పట్ల బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా మహిళా సెక్రెటరీ విద్యా కల్పన ఏకాంత్ గౌడ్ హర్షం వ్యక్యం చేశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి విజయ సంబరాలు జరుపుకున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బిజెపి విజయఢంకా మోగించడం మోదీ చరిష్మా ఏంటో అర్థమవుతోందని అన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో రాష్ట్ర కార్యాలయంలో కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బిజెపి మహిళా మోర్చా నాయకులు పాల్గొన్నారు.

బండి సంజయ్ తో కలిసి కేకు కట్ చేస్తూ విజయోత్సవాలు నిర్వహిస్తున్న విద్యాకల్పన
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here