నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సమస్యలన్నింటిని దశల వారీగా పరిష్కరిస్తానని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి లో నూతనంగా నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ పనులను కాలనీ వాసులతో కలిసి స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. నాణ్యతా విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిర్ణీత సమయంలో డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కె. రంగస్వామి ముదిరాజ్, ప్రసాద్, మధు ముదిరాజ్, నర్సింగ్, నగేష్, కె సాయి, అంజి బాబు, రావు గోపన్ పల్లి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.