వేతనాలివ్వాలని నైట్ స్వీపింగ్ వర్కర్ల నిరసన

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ జోనల్ పరిధిలో రాత్రి వేళ రోడ్లు ఊడ్చేందుకు మహిళా కార్మికులతో మూడు నెలలు పనిచేయించుకుని లాక్ డౌన్ పేరుతో తొలగించి వేతనాలు‌ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని సీఐటీయూ నాయకులు కృష్ణ, సాయి, శేషగిరిరావు వాపోయారు. మూడు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ఎదుట నైట్ స్వీపింగ్ వర్కర్లతో కలిసి సీఐటీయూ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండో సారి లాక్ డౌన్ ముందు నుంచి జీహెచ్ఎంసీ రాత్రి పూట రోడ్లు ఊడవడానికి మహిళా కార్మికులను నియమించుకొని మూడు నెలలు పని చేయించుకొని లాక్ డౌన్ పేరిట విధుల నుంచి తొలగింపజేశారని అన్నారు. ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ల ఫోటోలు తీసుకొని జీహెచ్ఎంసీ జాకెట్లు సైతం ధరించుకోవటానికి ఇచ్చారని అన్నారు. సంబంధిత కాంట్రాక్టర్లు మూడు నెలల జీతం చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. చట్టప్రకారం కాంట్రాక్టర్ తన సొంత డబ్బులు కార్మికులకు వేతనాలు చెల్లించి జీహెచ్ఎంసీకి బిల్లులు పెట్టుకోవాలని చట్టం చెబుతున్నా కాంట్రాక్టర్లు ఆ పని చేయడం లేదన్నారు. కార్మికులను ఇబ్బంది పెడుతున్న‌ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రెడ్ లిస్టులో పెట్టాలని జోనల్ కమిషనర్ ను కోరారు. అనంతరం జడ్సీ ప్రియాంక ని కలిసి వినతిపత్రం ఇచ్చారు. త్వరలోనే వేతనాలు‌ చెల్లించేలా చూస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జానకమ్మ, జయమ్మ, లక్ష్మీ, రుక్మిణీ, చెన్నమ్మ, ఉష, పెంటమ్మ, గురవమ్మ, బాలనాగమ్మ, కిషన్, ఆంజనేయులు, హేమలత, తారా, దయ, కవిత, సుజాత, సికిందర్, శ్రీను, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న‌ నైట్ స్వీపింగ్ వర్కర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here