నమస్తే శేరిలింగంపల్లి: పట్టణ ప్రగతిలో భాగంగా ఆరంబ్ టౌన్ షిప్ లో ప్రజల సౌకర్యార్థం ఓపెన్ జిమ్ ను ఏర్పాటు చేయనున్నట్లు శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. డివిజన్ పరిధిలోని ఆరంబ్ టౌన్ షిప్ లో రూ. 20 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఓపెన్ జిమ్ పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపెన్ జిమ్ ద్వారా ప్రజలందరికి ఎంతగానో ఉపయోగపడనున్నట్లు చెప్పారు. మహిళలకు ప్రత్యేక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి కాలనీని మోడల్ కాలనీలుగా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీకళ, ఆరంబ్ టౌన్ షిప్ కాలనీ ప్రెసిడెంట్ రవీందర్ రాథోడ్, గౌరవ అసోసియేషన్ ట్రెజరర్ నరేంద్ర కుమార్, అధ్యక్షులు నర్సింహులు యాదవ్, నయీమ్ ఉద్దీన్, జనార్ధన్, నాగరాజు, కృష్ణ, హరికిషన్, అరుణ విక్రమ్ యాదవ్, గోపాల్ యాదవ్, కుమారి, రోజా, భాగ్యలక్ష్మి, చంద్రకళ, జయ, సుధారాణి, ఝాన్సీ స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.