నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రజల సౌకర్యార్థం మౌళికవసతుల కల్పనకు శాయశక్తులా కృషి చేస్తానని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరీ నగర్ కాలనీలోని పార్కును స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని కార్పొరేటర్ అన్నారు.మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు నారాయణరావు, వెంకట్ రామిరెడ్డి, రంగారావు, నరసింహ రావు, ఫణీకృష్ణ, కల్యాణి, గోపాల్ రెడ్డి, ఫ్రాన్సిస్ షో రెడ్డి, శంకర్ రావు, బి ఎస్ రావు, రంగారాజు తదితరులు పాల్గొన్నారు.