నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది పేదలకు లబ్ది చేకూరుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 31 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 13.84 లక్షల చెక్కులను బాధిత కుటుంబాలకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు సాంబశివరావు, సైదేశ్వర్, గుడ్ల ధనలక్ష్మి, శివరాజు గౌడ్, ఎండీ ఇబ్రహీం, చంద్రమౌళి సాగర్, గురు చరణ్ దూబే, అంజనేయులు, వెంకట్ నాయక్, బసవయ్య, నర్సిములు, అష్రఫ్, ఖదీర్, యాసిన్, అంజలి తదితరులు పాల్గొన్నారు.