కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ఉద్యమ రథసారథి, బంగారు తెలంగాణ నిర్మాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కారణజన్ముడు అని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని స్పర్శ్ హాస్పీస్ క్యాన్సర్ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, పండ్ల రసాల పాకెట్స్ ను గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అందజేశారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి, బంగారు తెలంగాణ నిర్మాణానికి పాటుపడుతున్న కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. కేసీఆర్ కు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్పర్శ్ హాస్పీస్ సెంటర్ హెడ్ శశిధర్, సెంటర్ అడ్మిన్ అండ్ డాక్టర్ శారద, గచ్చిబౌలి డివిజన్ నాయకులు రాజు నాయక్, అంజమ్మ, రాజు ముదిరాజ్, నరేష్, సత్యనారాయణ, గోవింద్, రమేష్ గౌడ, సంపత్ కుమార్, జగదీష్, వెంకటేష్ ముదిరాజ్, శ్రీను, సుధీర్, నందిరాజు, అరుణ కుమారి విజయలక్ష్మి, ఆసుపత్రి సిబంది పాల్గొన్నారు.

రోగులకు పండ్లను అందజేస్తున్న మాజీ కార్పొరేటర్ సాయిబాబా

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here