పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి – ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ల డిమాండ్‌ – బొటానికల్ గార్డెన్ చౌరస్తాలో రేవంత్ దిష్టిబొమ్మ‌ దగ్దం

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తిప్రదాత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై తెలంగాణ రాష్ట్ర పీసీసీ‌ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ డిమాండ్‌ చేశారు. రేవంత్ వాఖ్యలకు నిరసనగా బొటానికల్ గార్డెన్ చౌరస్తా వద్ద కార్పొరేటర్లు
హమీద్ పటేల్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి, రోజాదేవి రంగారావు, మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్దం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ‌ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వెంటనే బేషరతుగా సీఎం‌ కేసీఆర్ కు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు రవీందర్ ముదిరాజ్, రంగారావు, డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, రాజు యాదవ్, కృష్ణ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, గౌతమ్ గౌడ్, సమ్మారెడ్డి, నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here