నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మూడు రోజుల సేవా కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ దేవునూరి ఆస్పత్రిలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రోడ్డుకు ఇరువైపులా, ఆసుపత్రి ప్రాంగణంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. దశాబ్దాల చిరకాల కోరిక అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మిరియాల రాఘవరావు, దేవునూరి ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. కొమురయ్య, శేరిలింగంపల్లి డివిజన్ వార్డ్ మెంబర్లు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బస్తీ కమిటీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు, అభిమానులు పాల్గొన్నారు.