నమస్తే శేరిలింగంపల్లి: గోపన్ పల్లి వీకర్ సెక్షన్ లో సీసీ రోడ్డు, త్రీ ఫేస్ విద్యుత్ లైన్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి వీకర్ సెక్షన్ కాలనీ వాసులు మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీకి పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ గోపన్ పల్లి వీకర్ సెక్షన్ లో సీసీ రోడ్డు, త్రీ ఫేస్ విద్యుత్ లైన్ వంటి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని, సీసీ రోడ్ల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. కాలనీలలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కోసం డ్రైనేజీ, రోడ్లు, మంచి నీరు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రాగం జంగయ్య యాదవ్, శంకరి రాజు ముదిరాజ్, గోవింద్, గోపన్ పల్లి వీకర్ సెక్షన్ కాలనీ వాసులు రాణి, లక్ష్మీ, సరిత, చెన్నమ్మ, సుగుణ, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు.