నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలో స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలిసి స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేశారు. ప్రజల సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్బంగా శ్రీకాంత్ మాట్లాడుతూ కాలనీలలో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. కరెంట్ స్థంభాల సమస్యను పరిష్కరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, బాలు చౌదరి, శ్రీనివాస్ గౌడ్, రమణ, మహిపాల్ రెడ్డి, శ్రీధర్, బిఆర్ చౌదరి, రాణి, జయలక్ష్మీ, సాంబయ్య, వివేక్ రెడ్డి, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.