నమస్తే శేరిలింగంపల్లి: ఆధ్యాత్మిక వాతావరణంతో మానసిక ప్రశాంతత అలవడుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధి కొత్తగూడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా బ్రహ్మోత్సవ రథ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు చేశారు. దైవ చింతన ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉట్ల కృష , మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు జంగం గౌడ్, సుబ్బయ్య యాదవ్, లక్ష్మణ్, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
