నమస్తే శేరిలింగంపల్లి: సీసీ కెమెరాల ఏర్పాటుతో శాంతిభద్రతలను పరిరక్షించుకోవచ్చని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆరంభ టౌన్ షిప్ లో అసోసియేషన్ ఏర్పాటు చేసిన 64 సీసీ కెమెరాలను శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ తమ సొంత నిధులతో ప్రధాన రహదారుల్లో పది సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, దీన్ని ఆదర్శంగా తీసుకొని అసోసియేషన్ ఆరంభ టౌన్‌షిప్ అంతా కవర్ అయ్యేలా కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని అన్నారు. నేటి సమాజంలో జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయని తెలిపారు. ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమంలో చందానగర్ సబ్ ఇన్‌స్పెక్టర్లు రాములు, అహ్మద్ పాషా, వెంకటేష్, అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్, మెంబర్లు రామిరెడ్డి, మహిపాల్ యాదవ్, నరేంద్ర కుమార్, శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రెడ్డి, ఆరంభ టౌన్‌షిప్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీంద్ర రాథోడ్, జనార్ధన్, నయీమ్ ఉద్దీన్, అరుణ విక్రమ్ యాదవ్, హరికిషన్, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.