నమస్తే శేరిలింగంపల్లి: సామాజిక సేవా దృక్పథంతో, దేశం కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ ముద్దుబిడ్డ, దివంగత మహావీర్ చక్ర అవార్డ్ గ్రహీత కల్నల్ సంతోష్ బాబు అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కీ. శే కల్నల్ సంతోష్ బాబు జన్మదినం సందర్భంగా చందానగర్ డివిజన్ గాంధీ విగ్రహం వద్ద బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ హాజరై కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కల్నల్ సంతోష్ బాబు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కల్నల్ సంతోష్ సతీమణి సంతోషి మాట్లాడుతూ దేశానికి సేవ చేసిన నా భర్త మరణాన్ని గుర్తుంచుకుని రక్తదాన శిబిరం నిర్వహిస్తున్న స్ధానిక నాయకులు రవికుమార్ యాదవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ కల్నల్ సంతోష్ బాబు నాయకత్వములో భారత సైనికులు ధీటుగా యుద్ధం చేసి వీరమరణం పొందారని అన్నారు. సంతోష్ బాబు వీరమరణం దేశానికి తీరని లోటన్నారు. ఆయన జన్మది సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో దాదాపు 100 మందికి పైగా పాల్గొని రక్తదానం ఇవ్వడం శుభపరిణామం అని అన్నారు. రక్తం అందక మరణించే వారిలో కొంతమంది ప్రాణాలనైనా కాపాడాలనే సదుద్దేశ్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో మువ్వాసత్యనారాయణ, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాఘవేంద్ర రావు, గంగాధర్ రెడ్డి, ఎల్లేష్, రాధాకృష్ణ యాదవ్, చంద్ర శేఖర్ యాదవ్, సీతారామరాజు, భరత్, అర్జున్ మల్లేష్ గౌడ్,
గణేష్, రమేష్ రెడ్డి, హనుమంతు నాయక్, మధు యాదవ్ ,మల్లికార్జున్ రెడ్డి, వినీత సింగ్, భారతి, చంద్రకళ, ఇందిరా, వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

