నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో ఒక వాహనాన్ని సీజ్ చేసి 22 మంది వాహన యజమానులకు చలాన్లు వేసినట్లు చందానగర్ సీఐ క్యాస్ట్రో తెలిపారు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి ఆదేశాల మేరకు చందానగర్ పోలీస్ సిబ్బంది, మియాపూర్ ట్రాఫిక్ సిబ్బంది సంయుక్తంగా తారానగర్ లో వాహనాల తనిఖీ చేపట్టినట్లు సీఐ క్యాస్ట్రో తెలిపారు. సక్రమంగా నంబర్ ప్లేట్లు లేని వాహనాలను, నంబర్ ప్లేట్లను మార్చిన వాహనాలను, నిర్ణీత కాలానిలి మించిన టీఆర్ ఉల్లంఘన వాహనాలను తనిఖీ చేసి ఒక వాహనాన్ని, 22 మంది వాహనదారులపై చలాన్లు బుక్ చేసినట్లు వివరించారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ లు ఎన్. శ్రీధర్, రంజిత్, మియాపూర్ ట్రాఫిక్ ఎస్ఐ చంద్రయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
