ఎమ్మెల్యే గాంధీ సహకారంతో సమస్యలు పరిష్కారిస్తాం – గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ సాయిబాబా

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగూడ పశువుల వైద్యశాలను గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పరిశీలించారు. అంతకుముందు నానక్ రాం గూడ వాసులు, వెటర్నరీ డాక్టర్ రామారావు తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా కలిసి పశు వైద్యశాలలో టాయిలెట్స్, ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే గాంధీ ఆదేశాల మేరకు పశువైద్యశాలను సందర్శించారు. పశు వైద్య శాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పశు వైద్యశాల లోని సిబ్బందికి టాయిలెట్స్ వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని పరిశీలించిన మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా వెంటనే టాయిలెట్స్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఆయన వెంట నారాయణ, జూపల్లి మధు, అనిల్ సింగ్, నరేష్ సింగ్, రమేష్ గౌడ్, కృష్ణా రెడ్డి, నానక్ రాం గూడ వాసులు, పశువైద్యశాల సిబ్బంది ఉన్నారు.

పశువైద్యశాలను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ సాయిబాబా

ఖాజాగూడ స్మశాన వాటిక పరిశీలన
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ పిజెఆర్ నగర్ లో గల స్మశానవాటికను మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఖాజాగూడ గ్రామస్థులతో కలిసి పరిశీలించారు. స్మశాన వాటికలో మౌలిక సదుపాయలు కల్పించేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గోవింద్, నారాయణ, రమేష్ గౌడ్, ఖాజాగూడా వాసులు వీరయ్య, సత్యం, శివలింగం, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

ఖాజాగూడ పీజేఆర్ నగర్ లోని స్మశాన వాటిక స్థలాన్ని పరిశీలిస్తున్న మాజీ కార్పొరేటర్ సాయిబాబా
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here