నమస్తే శేరిలింగంపల్లి: ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై దగ్ధమైన గుడిసె బాధితులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు జెరిపాటి జైపాల్ డిమాండ్ చేశారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో ప్రమాదవశాత్తు దగ్ధమైన గుడిసె బాధితులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. జెరిపాటి జైపాల్, నియోజకవర్గం అధ్యక్షుడు ఎండి ఇలియాస్ షరీప్ బాధిత కుటుంబ సభ్యులకు రూ. 10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వి.కృష్ణ, రాములు, ఈశ్వర్, చందు, వై ఎం. తిరుపతి, నడిమింటి కృష్ణ, మన్నే నరేందర్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
