ఇంటింటి పీవర్ సర్వేలో కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: కరోనా కట్టడికి టీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి తెలిపారు. కొవిడ్‌ కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి ఫీవర్‌ సర్వే కార్యక్రమాన్ని శనివారం చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట లో వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు చేపట్టారు. చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారికి వెంటనే మెడికల్‌ కిట్‌ లను కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి ఫీవర్​ సర్వే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరిష్ రావు ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుందన్నారు. వైద్యబృందాలు ఇంటింటికీ వచ్చి ప్రజల ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని తెలిపారు. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉన్నా వారికి వెంటనే మెడికల్‌ కిట్లు అందిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ ఫీవర్​ సర్వేకు సహకరించాలి కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, జీహెచ్ఎంసీ సిబ్బంది, కాలనీ వాసులు అక్బర్ ఖాన్, యూసుప్, ఖదార్, అమిత్ తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటి పీవర్ సర్వేలో మెడికల్ కిట్స్ ను అందజేస్తున్న కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here