నమస్తే శేరిలింగంపల్లి: వేమన రాసిన కవితలు, రచనలు, పద్యాలు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చైతన్యపరిచేలా ఉంటాయని రెడ్డి సంక్షేమ సంఘం నల్లా సంజీవరెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేమన జయంతి ఉత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు నల్లా సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పలు డివిజన్లలో యోగి వేమన రెడ్డి జయంతి కార్యక్రమాలను నిర్వహించి వేమన రాసిన పద్యాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నల్లా సంజీవరెడ్డి మాట్లాడుతూ వేమన రచనల ద్వారా సమాజాన్ని చైతన్య పరిచడం జరిగిందన్నారు. అభ్యుదయవాది, ప్రజాకవి, సంఘ సంస్కర్త యోగి వేమన రెడ్డి అన్నారు. వేమన శతకాలు తెలియనివారు ఉండరని పేర్కొన్నారు. వేమన జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వేమన జయంతిని నిర్వహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెడ్డిజాగృతి అధ్యక్షులు పిట్ల శ్రీనివాసరెడ్డి, తాడూరు గోవర్ధన్ రెడ్డి , గున్నాల అనిల్ రెడ్డి, దుర్గి రవీందర్ రెడ్డి, కొండవీటి ప్రభాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి , రవీంద్ర నాథ్ రెడ్డి, ఆల్విన్ కాలనీ సంజీవ రెడ్డి, చంద్రా రెడ్డి, భవానీపురo రఘునందన్ రెడ్డి, గుల్ మొహర్ పార్క్ నిరంజన్ రెడ్డి, మాదాపూర్ గోవర్ధన్ రెడ్డి, రెడ్డి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
