నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడున్నరేళ్లుగా కాలయాపన చేస్తోందని, ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని బిజెవైఎం శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ అమర్నాథ్ యాదవ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదలచేయాలని బిజెవైఎం ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. తెలంగాణ వచ్చి ఏడు సంవత్సరాలైనా ఇప్పటికీ ఉద్యోగ నోటిఫికేషన్లు విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతుందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మేల్కొని ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని బిజెవైఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్, రాష్ట్ర మహిళా సెల్ కన్వీనర్ కసిరెడ్డి సింధు రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జితేందర్, జిల్లా కార్యదర్శులు కుమార్ సాగర్, సాయి కుమార్, మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధూ, కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు నవీన్, హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు నందు, డివిజన్ ప్రధాన కార్యదర్శి సాయి పటేల్, ఉదయ్ సాగర్, రాఘవేంద్ర, బాలు, ధరణి, గోవింద్, రాజు , హర్షిత్, కె రాజు, తదితరులు పాల్గొన్నారు.
