నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ, ఎల్లమ్మ తల్లి దేవాలయంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి, నార్సింగ్ మునిసిపల్ చైర్మన్ రేఖ యాదగిరి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో డివిజన్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన అన్నారు . ఆలయాలు మానసిక ప్రశాంతతకు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. కరోనా పూర్తిగా అంతమై ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. గచ్చిబౌలి డివిజన్ లో ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, నగేష్, యాదగిరి, భగవాన్ సింగ్, శ్రీరాములు, కిషన్ గౌలి, ప్రకాష్, హరీష్ శంకర్ యాదవ్, శ్రీకాంత్, రాజు, శ్రీను, ప్రభాకర్, శ్రీను, నరేష్, ప్రసాద్, రమేష్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.