నమస్తే శేరిలింగంపల్లి: దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, మునుపెన్నడూ లేనివిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం దివ్యాంగులకు పింఛన్ అందజేస్తోందని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డిని శేరిలింగంపల్లి దివ్యాంగుల పట్టణ సమాఖ్య నాయకులు శుక్రవారం ఆమె స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎలాంటి సహాయమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కార్పొరేటర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన గీప్ట్ ఏ స్మైల్ లో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వికలాంగులకు ద్విచక్ర వాహనాలు అందించాలని కార్పోరేటర్ కి దివ్యాంగులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ దృష్టికి తీసుకెళ్లి తమవంతు సహయం అందిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి దివ్యాంగుల పట్టణ సమాఖ్య అధ్యక్షులు అశోక్ కుమార్, ఎంఏ సర్తాజ్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.