నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ ద్వి దశాబ్ది వేడుకల్లో భాగంగా మాదాపూర్ హైటెక్స్ లో ఈ నెల 25న నిర్వహించే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం ఏర్పాట్లను, సభా వేదిక ప్రాంగణం, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లను గురువారం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్, టీఎస్ఐసీసీ చైర్మెన్ గ్యాదరి బాలమల్లు, పౌర సరఫరాల ఛైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మాజీ మేయర్ బొంతు రాం మోహన్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ రంగారావు పరిశీలించారు. ప్లీనరీ సమావేశానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులకు, ముఖ్య అతిథులకు, నాయకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయా కమిటీల సభ్యులు సూచించారు. వాహనాల పార్కింగ్, భోజన వసతులు, టాయిలెట్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో వాటి నిర్వహణ తీరును పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు గౌతమ్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు వాలా హరీష్ రావు, మిద్దెల మల్లారెడ్డి, లక్ష్మారెడ్డి, సాంబశివరావు, నల్ల సంజీవ రెడ్డి, ప్రసాద్, బాలింగ్ యాదగిరి గౌడ్, రాంచందర్, దొంతి శేఖర్, తిరుమలేష్, కంది జ్ఞానేశ్వర్, సయ్యద్ గౌస్, శ్యామ్, జామిర్, అశీల శివ, లోకేష్, జ్ఞానేశ్వర్, ఇమ్రాన్, సాబేర్, సుదేష్, తైలి గిరి, శ్రీనివాస్ నాయక్, రషీద్, ఖాసిం, కార్యకర్తలు పాల్గొన్నారు.