గజ్జల యోగానంద్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం

నమస్తే శేరిలింగంపల్లి:ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 20 ఏళ్ల సుపరిపాలన పూర్తయిన సందర్భంగా సేవ ఔర్ సమర్పణ్ అభియాన్ లో భాగంగా శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెపి ఇంఛార్జి గజ్జల యోగానంద్ సౌజన్యంతో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు శెట్టి కురుమ అధ్వర్యంలో సురభి కాలనీ లోనీ శారద విద్యానికేతన్ హై స్కూల్ లో ఉచిత కంటి, ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నరేంద్ర మోదీ 2014 లో ప్రధాన మంత్రి అయినప్పటి నుండి దేశం లో ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా  ఎన్నో ఎమ్స్ ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చారని, పేద వారికి అందని ద్రాక్షగా ఉన్న ప్రైవేట్ వైద్యాన్ని అయుష్మాన్ భారత్ అనే పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ 5 లక్షల భీమా అందించడం జరుగుతుందన్నారు. ప్రధాన మంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికీ హెల్త్ ఐడీ లు పంపిన చేస్తున్నారని, దీని ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్య రికార్డ్స్ ఒకే దగ్గర పొందుపరచడం ద్వారా చికిత్స మరింత మెరుగు అవుతుందన్నారు. ఇలాంటి ఎన్నో వినూత్న పథకాలతో మోదీ ఆరోగ్య వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, భువనగిరి జిల్లా ఇంఛార్జి నంద కుమార్ యాదవ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, సీనియర్ నాయకులు రవి కుమార్ యాదవ్,  పదాధికారులు రమేష్, సోమిశెట్టీ రాఘవేందర్ రావు, శ్రీధర్ రావు, రాధ మూర్తి, సుర్ణ శ్రీశైలం, కె. ఎల్లేశ్, భరత్ రాజ్, బి. విజయ్ లక్ష్మీ, సత్య కురుమ, లక్ష్మణ్ ముదిరాజ్, బాలరాజు, శ్రావణ్ పాండే, సుర్ణ రాజు, వీరేశ్ ఖేల్గి, రవి గౌడ్, సీనియర్ నాయకులు , మహిపాల్ రెడ్డి, శాంతి భూషణ్ రెడ్డి, కృష్ణవేణి స్వాతి, క్రాంతి మాదిగ, శ్రీకాంత్ కురుమ, బీ సత్య నారాయణ, వి గాయత్రి, స్వాతి, బబ్లీ దేవి, ఎల్లేష్ కురుమ, ప్రభు, బీ కళ్యాణ్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here