నమస్తే శేరిలింగంపల్లి: శ్రీరామనవమి ఉత్సవాలు చందానగర్ డివిజన్ పరిధిలోని భవానిపురం ఆలయంలో ఘనంగా జరిగాయి. భవాని పురం కాలనీ మాజీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ రెడ్డి స్వంత ఖర్చులతో అందజేసిన సీతారామచంద్రుల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అంగరంగవైభవంగా కళ్యాణోత్సవం చేయించారు. ప్రతి సంవత్సరం కాలనీలో శ్రీ రామ నవమి వేడుకల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిపించేందుకు శాశ్వతంగా ఓ విగ్రహాలను అందజేయడం సంతోషకరమని లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డితో కలిసి స్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.